అంబానీ ఆ.... రేంజ్ ఏ వేరు ! అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.?
దాని విలువతో మాలాంటి వాళ్లు ఒక పెళ్లి చేసుకోవచ్చు....వివరాలు చూదాం రండీ
6/27/20241 min read


అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలో జరగనుంది.
అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.? అక్షరాలా రూ. 6.50 లక్షలు. మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది.
అనంత్ అంబానీ వివాహ వేడుక ముచ్చట్లు చూస్తున్నా, ఎంత వింటున్నా.. తనివి తీరడం లేదు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన వివాహంగా గుర్తించబడ్డ ఈ వివాహానికి సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక ఖర్చు అక్షరాలా రూ. 6.5 లక్షలు. గతంలో కూడా అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహ పత్రిక ధర మూడు లక్షలు అంటే.. అందరూ నోరెళ్ళబెట్టారు.
వెండితో చేసిన చిన్న గుడి లాంటి పెట్టె. పెట్టె తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. పెట్టె లోపల 24 క్యారెట్‌ల బంగారు విగ్రహాలు కూడా ఉండడం అందరినీ ఆకర్షించింది.
కార్డులో మొదట గణేష్, విష్ణువు, లక్ష్మీదేవి, రాధా-కృష్ణ, దుర్గాదేవి వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలు ఉన్నాయి.అంబానీల వివాహ ఆహ్వాన పత్రికలో మరొక వెండి పెట్టె ఉంటుంది. దాని ముందు భాగంలో విష్ణువు బొమ్మ ఉంది. పెట్టెను తెరిచినప్పుడు, దానిలో ఓం అని ఎంబ్రాయిడ్ చేయబడిన ఒక శాలువ, నెట్ హాంకీ ఉన్నాయి. ఆ పెట్టెలో బంగారంతో అలంకరించబడిన వివిధ హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి.