మాములుగా నడిస్తేయ్ కిక్ ఏమి ఉంది అప్ప !!! వెనక్కి నడిచి చూడు ఎన్ని ప్రయోజనాలో !!!!

వెనక్కి నడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తేయ్ ......

7/1/20241 min read

ఆరోగ్యానికి నడకకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. .రివర్స్ వాకింగ్‌లో మామూలు నడకకంటే.. ఎక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయి. దీనిలో కండరాలు ఎక్కువగా కష్టపడతాయి.

ముందుకు నడవడమే కాదు.. వెనక్కి నడిస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. రోజుకు కనీసం 30 నిమిషాలైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. నడక చాలా తేలికైన, చవకైన అందరికీ అందుబాటులో ఉండే అందరూ చేయదగిన వ్యాయాయం. నడవడానికి ప్రత్యేకమైన పరికరాలేవీ అవసరం లేదు. నడక రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. గుండె సమర్థంగా పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌ ఉంటుంది. రోజు నడిస్తే.. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుంది.

1.బుర్రకు పదును పెడుతుంది..

వెనక్కి నడవడం వల్ల ఆలోచనా నైపుణ్యాలను పదును పెడుతుంది. అభిజ్ఞా నియంత్రణను పెంచుతుంది. ఇది కళ్లకు చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని ఇంద్రియాలను పదునుపెట్టి.. మానసిక, శారీరక సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

2.మోకాళ్ల నొప్పిని తగ్గిస్తుంది..

బాడీని స్టిమ్యులేట్ చేస్తుందని మరో అధ్యయనం పేర్కొంది.​

బయోమెకానిక్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ముందుకు వాకింగ్ చేయడం కంటే వెనక్కి నడవటం వల్ల మోకాలి నొప్పిని తగ్గిస్తుందని పేర్కొంది. బాడీని స్టిమ్యులేట్ చేస్తుందని మరో అధ్యయనం పేర్కొంది.

3.కేలరీలు ఎక్కువగా బర్న్‌ అవుతాయి..

అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం గంటకు 3.5 మైళ్ల వేగంతో నడిస్తే.. 4.3 METలు క్యాలరీలు బర్న్‌ అవుతాయి, అదేసమయంలో రివర్స్‌ వాకింగ్‌ వల్ల.. 6.0 METలు బర్న్‌ అవుతాయని స్పష్టం చేసింది కాబట్టి ACSM ప్రకారం, వేగంగా నడవడం కంటే రివర్స్ వాకింగ్ నిమిషానికి 40% ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది.దీనివల్ల త్వరగా బరువు తగ్గగలరు.

4.కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌ని మెరుగుపరుస్తుంది..

ఓ అధ్యయనం ప్రకారం రివర్స్ వాకింగ్ మీ కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌కు మేలు చేస్తుంది. రివర్స్‌ వాకింగ్.. గుండె, ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ను మరింత సమర్థంవంతంగా అందించడానికి సహాయపడుతుంది. రివర్స్‌ వాకింగ్‌ శరీరంలో కొవ్వు, కరిగిస్తుంది.

రివర్స్‌ వాకింగ్‌.. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

5.అర్థరైటిస్‌ ఉన్నవారికి మేలు చేస్తుంది..

ఈ రకమైన నడక ఆస్టియో ఆర్థరైటిస్‌, జువెనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారికి పలు రకాల ప్రయోజనాలిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. మోకాళ్లు, నడుము నొప్పి ఉన్నవారికి ఉపశమనాన్నిస్తుంది. రివర్స్‌ వాకింగ్‌ నడక వేగం, సమతుల్యత మెరుగుపరుస్తుంది. ఇతర ఫిజికల్ థెరపీ చికిత్సలతో కలిపినప్పుడు, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ACL గాయాలు ఉన్నవారిలో రివర్స్‌ వాకింగ్‌ మేలు చేస్తుంది.​