రోజు కి ఒక గుడ్డు ఆరోగ్యాయానికి వెరీ గుడ్ !!!!!
కోడి ముందా గుడ్డు ముందా!! దాని గురించి సరే కాని గుడ్డు తింటెయ్ ఎన్ని లాభాలో తెలుసుకుందాం.....
7/4/20241 min read


చాలా మందికి గుడ్లు ఫేవరెట్ ఫుడ్. ఏ వంటకమైన గుడ్లతో సులభంగా, చిటికెలో చేసుకోవచ్చు. వీటితో వండే ఎలాంటి వంటకాలైనా ఎంతో రుచికరంగా ఉంటాయి గుడ్లను ఏ విధంగా అయినా వండుకోవచ్చు, ఎన్నో రకాల వెరెటీలు చేసుకోవచ్చు. గుడ్డుతో ఆమ్లెట్ చేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసి ఎగ్ భుర్జీ చేసుకోవచ్చు, ఉడికించుకొని తినవచ్చు, లేదా కొంతమంది నేరుగా పచ్చివి కూడా తినేస్తారు.
గుడ్లు అనేవి అందరికీ అందుబాటులో లభించే పవర్-ప్యాక్డ్ సూపర్‌ఫుడ్. ఈ గుడ్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న గుడ్లు తింటే చాలా లాభాలున్నాయి..అయితే, గుడ్లను నూనెలో వేయించి తినడం లేదా పచ్చిగా తినడం కంటే బాగా ఉడికించుకొని తింటేనే చాలా ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు అంటున్నారు.
ఉడికించిన ఒక గుడ్డు సుమారు 77 కేలరీలు కలిగి ఉంటుంది. అలాగే ఉడికించిన గుడ్డులో విటమిన్లు A, B5, B12, D, E, K, B6 లతో పాటు ఫోలేట్, భాస్వరం, సెలీనియం, కాల్షియం, జింక్ వంటి మూలకాలు, ఇంకా ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఉడికించుకొని తినడం ద్వారా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. గుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరుగుతుందనే అపోహ ఉంది. అందుకే, చాలా మంది దీనిని తినరు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, ఇది ట్రాన్స్‌ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవు.
ఉడికించిన గుడ్డులో జింక్‌తో పాటు విటమిన్ బి6 , బి12 మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఫ్లూ, జలుబును నివారించడంలో సహాయపడతాయి. కాబట్టి రోజుకో ఉడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల వర్షకాలంలో ఎదురయ్యే సమస్యలను నిరోధించవచ్చు.
Image designed by: "Freepik"