అబ్బా చుస్తేయ్ నోరు ఊరిపోతోంది!!! పండు! పండు! పండు... ఎర్ర పండు ఆపిల్ కాండండోయ్

అబ్బా చుస్తేయ్ నోరు ఊరిపోతోంది!!! పండు! పండు! పండు... ఎర్ర పండు ఆపిల్ కాండండోయ్!!ఆరోగ్యానికి మేలు చేసే ఎర్ర రత్నాలు…

6/29/20241 min read

చెర్రి అనేది ప్రునస్ జాతికి చెందిన మొక్కలు. వెస్ట్ ఇండియన్స్ చెర్రీ, బార్బర్ చెర్రీ ఉష్ణ మండల పంటగా పరిగణిస్తారు.శాస్త్రవేత్తల శ్రమ ఫలించడంతో ఈ విదేశీ పంట ఇప్పుడు ఏజెన్సీలో విరగకాస్తోంది. ఉష్ణ మండల ప్రాంతాల్లోనే పండే ఆ ఫలం.. ఇప్పుడు మన తెలుగు నేలపై అడుగు పెట్టింది. టమాటాలా కనిపిస్తూ.. ఎర్రగా ఆకర్షిస్తూ.. అరుదుగా పండే కరేబియాన్ చెర్రీస్ ఇప్పుడు ఆంధ్రాలో పండిస్తున్నారు.

ఆంధ్ర కాశ్మీరం అంటే టక్కున గుర్తొచ్చే ప్రాంతం లంబసింగి. ఆపిల్, స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఫల తోటలకు అనుకూల వాతావరణం కలిగిన అల్లూరి ఏజెన్సీ చింతపల్లిలో ఇప్పుడు మరో అరుదైన పంట పండుతోంది. మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పండే కరేబియన్ చెర్రీస్… ఇప్పుడు చింతపల్లిలో విరివిగా కాస్తోంది. అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రములో ఉద్యానవన పరిశోధన కేంద్రములో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రయోగాత్మకంగా నాటిన కరేబియాన్ చెర్రిస్ చెట్లు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి.

చెర్రీస్ ఫైబర్ యొక్క మంచి మూలం, ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు ఆజ్యం పోయడం మరియు ప్రేగు క్రమబద్ధతను ప్రోత్సహించడం ద్వారా మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

అన్ని చెర్రీస్ ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు, దీర్ఘకాలిక వ్యాధిని తగ్గించవచ్చు ప్రమాదం మరియు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.