అందానికి ,ఆరోగ్యానికి రోజుకొక గ్రీన్ టీ !!!!
నిద్ర లేస్తే టీ... నిద్ర వస్తే టీ... నలుగురు వస్తే టీ.. నలుగురు కలిస్తే టీ.. మత్తు గా అనిపిస్తే టీ... ఏదైనా మొదలు పెట్టే ముందు టీ... కొంతమందికి టైమ్ నాలుగు ఐతే టీ... ఇంకొంత మందికి టైమ్ తో సంబంధం లేనిది టీ... పరిచయాలు పెంచేది టీ... పంచాయతీలకి కావాల్సింది టీ..
7/1/20241 min read


భారతదేశంలో, టీ తరచుగా ఆతిథ్యానికి చిహ్నంగా మరియు సామాజిక సమావేశాలలో ముఖ్యమైన భాగం. అతిథులకు స్వాగత సంజ్ఞగా టీ అందించడం ఆనవాయితీ.అయితే టీ కి బదులు గ్రీన్ టీ తాగి ఆరోగ్య ప్రయోజనాలు పొందుదాం.
గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది.
1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం గుండె జబ్బులకి ప్రధాన కారణాలు. గుండెలో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఆర్టరీస్‌లో ప్లేక్ ఫార్మ్ అయ్యి గుండె జబ్బులకీ స్ట్రోక్‌కీ దారి తీస్తుంది. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.
2. బరువు అదుపులో ఉంటుంది:
ఓవరాల్ హెల్త్ బాగుంటుంది మరియు,బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వారు, గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గుతారు.
3. బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది:
గ్రీన్ టీ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని.ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
4. మెదడుకి మంచిది:
బ్రెయిన్ ఎఫెక్టివ్‌గా పని చేయాలంటే హెల్దీ బ్లడ్ వెస్సెల్ సిస్టమ్ అవసరం. రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా రెడ్యూస్ చేస్తుంది.
5. వయసు మీద పడకుండా కాపాడుతుంది:
గ్రీన్ టీ లో ఉండే పాలీ ఫెనాల్స్ స్కిన్ ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. ముడతలు రాకుండా చేసి కొలాజెన్ ఉత్పత్తికి తోడుపడ్తుంది.
6. ఓరల్ హెల్త్‌కి మెరుగుపరుస్తుంది:
దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింప చేస్తాయి.
డెంటల్ హెల్త్ కీ క్యావిటీలు వచ్చే రిస్క్ తగ్గడానికీ కూడా గ్రీన్ టీ పని చేస్తుంది. ఓరల్ కాన్సర్ వచ్చే రిస్క్‌ని కూడా గ్రీన్ టీ తగ్గించగలదని తెలుస్తోంది.
7. బీపీ అదుపులో ఉంచుతుంది:
గ్రీన్ టీ వల్ల హైబీపీ రిస్క్ తగ్గుతుందని చెప్పొచ్చు. హైబీపీకి కారణమయ్యే హార్మోన్‌ని గ్రీన్ టీ అణిచి వేస్తుందని తెలుస్తోంది.
8. కాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:
కాన్సర్ వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. ఫ్రీ రాడిలస్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ గ్రీన్ టీ ఈ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది.
9. జుట్టు ఊడకుండా కాపాడుతుంది:
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్‌లాస్‌ని ప్రివెంట్ చేస్తాయి. హెయిర్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసి జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి.
10. ఎముకలు బలాన్ని పెంచుతుంది:
గ్రీన్ టీ ఆస్టియో పొరాసిస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.గ్రీన్ టీ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.


Image designed by "Freepik"