వాన వాన వలప్ప !!! రోగాలు వస్తేయ్ జాగ్రత్త అప్పా!!!

ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనం వర్షాల చిరు జలులకి రిలాక్స్ అవుతున్నారు. అయితే, ఈ సీజన్‌లోనే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.......

7/3/20241 min read

ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనం వర్షాల చిరు జలులకి రిలాక్స్ అవుతున్నారు. అయితే, ఈ సీజన్‌లోనే వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, ఫ్లూ, వచ్చే అవకాశాలు ఎక్కువ. . అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవడంతో పాటు, ఫిట్‌గా ఉండటం చాలా అవసరం. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినాలి.

ఈ చిట్కాలు పాటించండి:

గోరు వెచ్చని నీరు తాగాలి:వర్షం కాలం అంత దాహం వేయదు అలా అని నీరు తాగకుండా ఉండకుండ. కాచి చలర్చిచిన గోరు వెచ్చని నీళ్లు సిప్ చేస్తూ తాగుతూ ఉండాలి.రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

బయటి ఫుడ్స్ జోలికి పోవద్దు:వాతావరణ మార్పుల కారణంగా బయటి ఫుడ్స్‌ మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి.

కషాయాలు తాగండి : వర్షాకాలంలో అల్లం, హెర్బల్ టీలు, కూరగాయల తో చేసిన సూప్‌లు తాగాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి రోజు వాడాలి: వెల్లుల్లి, ఉల్లిపాయలు సహజంగా యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఇవి రక్షిస్తాయి.

విటమిన్ సి: నిమ్మకాయలు, నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి కాపాడుతాయి.

Image designed by:"Freepik"