నోరు కట్టేసుకోవాల్సి పని లేదు!! ఈ స్నాక్స్ తింటే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

డయాబెటీస్ ఉన్నవారు నచ్చింది తినలేక ఇబ్బంది పడతా ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా స్నాక్స్ తినవచ్చు...

7/5/20241 min read

డయాబెటీస్ ఉన్నవారు నచ్చింది తినలేక నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత కేర్ అవసరం. టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులు.. వారి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, భోజనం మధ్య.. స్నాక్స్‌ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ స్నాక్స్‌ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఏమీ పెరగవు. మీ డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది.

మొలకెత్తిన గింజలు:

మన అందరికి తెలిసిన విషయమే మొలకెత్తిన గింజలు తినడం, మన ఆరోగ్యానికి ఎంత మంచిదో, వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. మరీ ఎక్కువ మోతాదులో కాకుండా తగినన్ని తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఆకలిని నియంత్రిస్తాయి.

పాప్‌కార్న్:

పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. . జొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్‌కార్న్‌లో ఫైబర్‌, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. మన శరీరంలో తగినంత ఫైబర్‌ ఉంటే..రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి. ఇది షుగర్‌ పేషెంట్స్‌ మేలు చేస్తుంది.

ఉడికించిన గుడ్లు:

ప్రొటీన్‌ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.ప్రోటీన్ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. గుడ్లలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు తమ ఆహారంలోకి గుడ్డును స్నాక్‌గా తీసుకోవచ్చు.

ఓట్స్:

ఓట్స్ తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. ఓట్స్‌లో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.

బాదంపప్పు:

దీనిలో విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటుంది. దీనితో పాటు మాంగనీస్‌, మెగ్నీషియం, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బాదం రోజూ తింటే.. క్లోమం పనితీరు మెరుగుపడుతుంది. ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వల నియంత్రణ మెరుగవుతుంది. శరీర ద్రవ్యసూచీ (బీఎంఐ), బరువులో తగ్గుదల కనిపిస్తుంది. ఇది షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది.

శనగలు:

శనగల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.షుగర్‌ పేషెంట్స్‌కు బెస్ట్‌ స్నాక్స్‌ అని చెప్పొచ్చు. శనగల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. శనగల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 43 ఉంటుంది.. ఇది పోషకాలను రక్తంలోకి నెమ్మదిగా గ్రహిస్తుంది, రక్తంలోకి గ్లూకోజ్‌ను నెమ్మదిగా పంపిస్తుంది.

Image source-pexels