ప్లాస్టిక్ భూతం వెనుక గల నిజం:వీర్యకణాలు,వీర్య నాణ్యతలో తగ్గుదల
ప్లాస్టిక్ వలన కలిగే దుష్ప్రబావాలు మనకి తెలిసిందే, ఇప్పుడు పురుషులకి ఎంత హాని చేస్తుందో తెలుసుకుందాం
6/28/20241 min read


మానవజాతి మనుగడకే ప్లాస్టిక్ పెద్ద ముప్పుగా పరిణమించింది.ప్రస్తుత జీవితంలో ప్లాస్టిక్ లేకుండా రోజు గడవదు. అంతేకాదు.. హానికరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతోంది. మంచినీళ్ల సీసా, టీ కప్పు, భోజనం ప్లేట్.. ఇలా ఏదైనా అన్నీ ప్లాస్టిక్ తోనే ముడిపడిపోయాయి. ప్లాస్టిక్ లో ఉండే అతి చిన్న రూపమైన ప్లాస్టిక్ వ్యర్థ కణాలు గాలి, నీరు, ఆహారంద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనివల్ల గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు వంటి అన్ని అవయవాలపై ఇవి హానికర ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
వీర్య నమూనాల్లో ప్లాస్టిక్ కణాలు
ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఓ భాగంగా మారిపోయింది.ఆహారపు అలవాట్లు మారడం, జీవనశైలి మారిపోవడంవల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటోంది. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. చైనా లోని 36 మంది ఆరోగ్యవంతమైన యువకుల స్పెర్మ్ ను ప్రయోగశాలలో పరీక్షించారు. పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది.. స్పెర్మ్ సెల్స్ లో ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయని చైనా పరిశోధకులు కూడా తేల్చారుఅన్ని నమూనాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొని వీరంతా షాక్ అయ్యారు.
ప్లాస్టిక్ కి దూరంగా ఉంటే మంచిది
వీలైనంతమేరకు పురుషులు ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.మంచినీళ్ల సీసాలు, బ్యాగుల తయారీలో ఉపయోగించే పాలీ ఇథిలిన్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ స్టైరిన్ వంటి కణాలను పురుషుల వీర్యంలో గుర్తించారు. ఈ ప్లాస్టిక్ కణాలు సంతానోత్పత్తికి కీలకమైన స్పెర్మ్ కణాల కదలికలను అడ్డుకుంటున్నట్లు తేలింది. స్పెర్మ్ కణాల పెరుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలో పురుషుల సంతానోత్పత్తిపై ప్లాస్టిక్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది.