KALKI 2898AD సరికొత్త రికార్డుల సునామి చెక్ అప్డేటెడ్ రిపోర్ట్ హియర్
బాక్స్ ఆఫీస్ బద్దలుకొడుతున్న కల్కి ఒక రోజు కలెక్షన్ తెలిస్తేయ్......
6/28/20241 min read


వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీగా నిర్మించిన కల్కి సినిమా.. రిలీజ్ కు ముందు నెలకొల్పిన భారీ అంచనాల తగ్గట్లే దూసుకుపోతోంది. ఎన్నడూ లేనంతగా రికార్డులు క్రియేట్ అయ్యాయి.
గతంలో ప్రభాస్ నటించిన సినిమాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. బాహుబలి 1 సినిమా తొలి రోజు 6.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక బాహుబలి 2 విషయానికి వస్తే.. 8.9 కోట్లు, సాహో 9.41 కోట్లు, రాధేశ్యామ్ 10.8 కోట్లు, ఆదిపురుష్ 13.68 కోట్లు, సలార్ సినిమా 22.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక కల్కి మూవీ కేవలం ప్రీ సేల్స్ లోనే ఏకంగా 3.8 మిలియన్ క్రాస్ చేసేసింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా సంచలన రికార్డు క్రియేట్ చేసింది.
నార్త్ అమెరికాలో కల్కి ప్రీమియర్స్ 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి-2 ప్రీమియర్స్ డే కలెక్షన్లను మించి నార్త్ అమెరికాలో కల్కి వసూళ్లు చేసింది. అది కూడా భారీ మార్జిన్ తో రాబట్టింది.భారతదేశంలో ₹95 కోట్ల,విదేశీ వసూళ్లు ₹65 కోట్లు.