ఉరుకుల పరుగుల జీవితం తినటానికే టైం లేదు ఇంకా పిండి వేసుకోవటం ఆ!!

ఇప్పుడు నడుస్తునా ట్రెండ్ రెడీమేడ్ ఇడ్లీ, దోశ పిండి.వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయి. అవేంటో తెలుసుకుందాం....

7/3/20241 min read

బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకి గుర్తొచ్చేది దోస, ఇడ్లీ. వీటిని చేసేందుకు పిండి అవసరం. అయితే, ఆ పిండిని ఇంట్లో రుబ్బుకునే ఓపిక, టైమ్‌లేక బయటి నుంచి కొనుక్కొచ్చి వాడుతున్నారు. కానీ, వీటి వల్ల చాలా సమస్యలొస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

ప్యాకెట్‌లోని పిండిని రుబ్బేటప్పుడు ఎలాంటి నీరు వాడతారో తెలియదు.కలుషిత నీటితో పిండిని మిక్సీ పడితే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. కలుషిత నీటి ద్వారా ఎకోలీ బ్యాక్టీరియా పెరిగి కడుపునొప్పి, విరోచనాలు, శరీరం పొడిబారడం, పేగు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలొస్తాయి.

ఇడ్లీ, దోశ పిండి ప్యాకెట్స్ నిల్వ చేసేందుకు, అవి పుల్లగా మారకుండా ఉండేందుకు బోరిక్ యాసిడ్ వేస్తారు. ఈ ప్యాకెట్స్‌ని బోరిక్ యాసిడ్‌తో కోటింగ్ చేసి ఆ తర్వాత అందులో పిండిని వేస్తారు. దీని వల్ల ఎక్కువరోజులైనా పిండి పులవదు. పులిసినా మనకు తెలియదు.

బోరిక్ యాసిడ్ కలిపిన పిండిని తీసుకోవడం వల్ల పేగులు ఎఫెక్ట్ అవుతాయి. కడుపు నొప్పి వస్తుంది. అజీర్తి వంటి సమస్యలొస్తాయి.